Friday, November 12, 2010

కాలం ఎంతో ఎంత కాలం సాగునో

కాలం ఎంతో ఎంత కాలం సాగునో ఏ కాలానికి తెలియును
తనకు తానుగా తనలో సాగే కాలం ఎంతో తనకే తెలియును
ఆగలేని భావంతో చలించే కాలం ఏ భావంతో ఎప్పుడు ఎక్కడ మొదలాయేనో
ఎక్కడ అంతమగునో గమ్యం తెలియక విశ్వమున సాగుతున్నది తన భావంతో
కాల భావన నాకు తెలుసు కాల ప్రభావాలు విశ్వానికి తెలుసు అదే నా విశ్వ విజ్ఞానము
కాలంతో సాగితేనే విశ్వ విజ్ఞానం తెలియునని నేను కాల భావనగా తనతో సాగిపోతున్నా
నా గమ్యం నాకు తెలియని విధంగా చీకటి వెలుగులతో క్షణ క్షణాలుగా ప్రయాణిస్తూనే ఉన్నా
కాలంతో సాగిపోవుటలో విశ్వమున కలిగే ప్రతి భావనను విశ్వ విజ్ఞానంగా మేధస్సున దాచుకుంటున్నా

No comments:

Post a Comment