కర్మను చాలించరా! ఓ విశ్వ యమ రాజా
ఆత్మ కూడా నశించి పోతున్నది ఓ యమ రాజా
ఆహారం రుచి లేక శరీరానికి ఓపిక లేక నివశించు ప్రాంతాన శుభ్రత లేదురా
సమస్యలెన్నో కాల విధిగా మేధస్సులో ఆలోచనలు తడబడుతున్నాయిరా
ఎన్నో ఓర్చుకున్నా మరల ఎన్నో సమస్యలు తలెత్తునురా ఓ యమ రాజా
కాలం అజ్ఞానంగా జీవితాన్ని సాగిస్తున్నదిరా జీవించుటలో సుఖ శాంతులు లేవురా
ఎందరో అజ్ఞానమై ఎందరో హీనమై జీవితాలు రహదారులలో సాగిపోతున్నాయిరా
వేళ కాని వేళ పనిచేస్తూ చాలని జీతాలతో సరైన ఆహారం లేక ఆరోగ్యాలు అనారోగ్యాలుగా
అవయవాలు సరిలేనివారు కూడా విధిగా వేళ కాని వేళ ప్రయాణిస్తూ ఎన్నో అవస్థలే
కర్త కర్మ క్రియల కాల ప్రభావాలు జీవితాన్ని భ్రమపరుస్తూ భయాందోళనలను కలిగించునురా
గ్రహచారంతో ఎందరో ఎన్నో విధాల దిక్కులు లేనట్లు ఇబ్బందులతో ఆత్మ ఘోషనే అనుభవిస్తున్నారు
ఆత్మ సంతృప్తికైనా జీవితాన్ని పర ధ్యాసలో విజ్ఞానంగా సాగించుటకు ధ్యాన మార్గాన్ని చూపరా ఓ యమా!
No comments:
Post a Comment