నేటి జన్మలో చదువుకోలేదంటే గత జన్మలో ఎంతటి విజ్ఞానివో
గత జన్మలో చదవలేదంటే వచ్చే జన్మలో ఎంతటి మహా జ్ఞానివో
ఏ జన్మలో చదవకపోయినా మేధస్సున హిత భావన ఉంటే చాలు
విశ్వ కాల భావనలు నీలో ఉంటే నీవే మహా జ్ఞాన విజ్ఞానివే
ఆత్మగా నీవు యుగాలుగా జన్మిస్తున్నావంటే ఎంతటి విశ్వ విజ్ఞానివో
ఎరుకతో ఆలోచించి తెలుసుకొని సత్యాన్వేషణ నీ శ్వాసలో చేసుకో
నీ ధ్యానమున తెలిసేను నీ జీవిత పరమార్థం ఏమిటో ఎందుకో ఎంత కాలమో
ఆలోచన కన్నా గొప్పగా మహా భావాలను గ్రహించగలిగితే ప్రతి జీవితం విజ్ఞానమే
నేడు మానవులు భావాలను వదిలేసి ఆలోచనలను తెలుసుకుంటూ మహా విజ్ఞానం అనుకుంటున్నారు
భావాలతో జీవిస్తే నీ మేధస్సు అజ్ఞాన కార్యాలను చేసేందుకు సహకరించవు
ఒకరి భాద క్షోభ నష్టం దుఖ్ఖం భావనగా తెలియనందుకే ఆలోచనతో అజ్ఞాన కార్యాలను చేస్తున్నావు
విజ్ఞాన భావాలను మరచిపోతూ అజ్ఞానంగా సాగుతున్నావంటే ఎంతటి మూర్ఖత్వమో
ఈ విశ్వ జగతిని నీవు భావాలతో విశ్వ విజ్ఞానంగా మార్చగలవని నేటి జన్మలో ఆలోచించవా
చదువుటలో కన్నా భావనలలో ఉన్న విశ్వ విజ్ఞానం అమరత్వమేనని నా అంతరిక్ష కాల భావన
No comments:
Post a Comment