నీ ఆలోచనలు ఏ దిక్కున ఎంత దూరం ఏ భావాలతో వెళ్లి పోతున్నాయో
విశ్వ విజ్ఞానాన్ని సేకరించుటకు ఏ లోకాన్ని అన్వేషిస్తూ వెళ్ళుతున్నాయో
మరల నీ యందు విశ్వ విజ్ఞానంగా భావాలతో వస్తే సూక్ష్మంగా గ్రహించగలవా
ఆలోచనలలో ఓ విశ్వ కాల విజ్ఞాన ఎరుకను మేల్కొల్పి భావాలను గ్రహించు
మరలా కలగని విశ్వ లోక రహస్య దివ్య విజ్ఞాన భావాలు నీ మేధస్సును చేరలేవు
విశ్వపు అంచులు తాకే భావనాలోచనను నీవు మరో దిక్కు నుండి గ్రహించగలవు
No comments:
Post a Comment