Tuesday, November 16, 2010

ఏ క్షణం నీవెంట వచ్చును ఏ భావన

ఏ క్షణం నీవెంట వచ్చును ఏ భావన నీకు తోడుగా నిలుచును
ఏ భావన ఏ క్షణాన కలుగును ఏ క్షణం నీకు భావనను తెలుపును
భావనలేని క్షణం లేదు భావనను గ్రహించని క్షణాలు ఎన్నో ఉండును
మేధస్సు భావనను మరచినా కాలానికి తెలియునులే ఆ భావన ఏదో
నీలో లేని భావన నీవు మరణించిన తర్వాత నీ ఆత్మ వెంట వచ్చేనులే
నీవు లేకున్నా నీ ఆత్మ భావన కోసం ఓ క్షణం ఎప్పటికి నీ జన్మకు ఉంటుందిలే

No comments:

Post a Comment