నా మేధస్సులో ఉదయించిన తర్వాతనే ఆకాశంలో మెరిసే దివ్య రూపాలు దర్శనమిచ్చేను
నా మేధస్సులో మెరిసే దివ్య కాంతి వెలుగులు లోకాన్ని పరిపూర్ణ భావాలతో దర్శించును
విశ్వ మేధస్సుగా మెరిసే నా మేధస్సు మహా విశ్వ రూపాలకు ఆది స్థానమై నిలిచియున్నది
నా మేధస్సులోనే సూర్య చంద్ర నక్షత్రాలు దర్శన మిచ్చి మరల విశ్వానికి వెలుగునిస్తాయి
తొలి కిరణం తొలి మెరుపు తొలి కాంతి తొలి వర్ణం తొలి భావన నా మేధస్సులోనే కేంద్రమవుతాయి
No comments:
Post a Comment