యోగ నిద్ర చేసే మహాత్మ విశ్వాన్ని చూడవా మరోసారి నీ దివ్య నేత్రాలతో
అసంఖ్యాక జీవరాసుల జీవిత రాతలు ఆత్మ ఘోషగా నీకు తెలియునా
నీలోని విశ్వ చైతన్యం జీవించే ఆత్మలకు కలిగేలా దైవ విజ్ఞానాన్ని భోధించు
అజ్ఞానాన్ని మేల్కొలిపే విశ్వ విజ్ఞానాన్ని విధిగా జీవించే మేధస్సులలో కలిగించు
నీ నేత్రాలలో దాగిన కాంతిని విశ్వానికి మరోసారి విజ్ఞానంగా అందించు
No comments:
Post a Comment