Tuesday, November 16, 2010

వర్షానికి తడిసే జీవరాసులెన్నో అగ్నికి

వర్షానికి తడిసే జీవరాసులెన్నో అగ్నికి ఆహుతయ్యే జీవరాసులెన్నో
ఎండకు చలి గాలులకు మరణించే జీవరాసుల ఇబ్బందులు ఎన్నెన్నో
ప్రతి క్షణాన్ని ఆలోచిస్తే దిక్కు తోచని విధంగా తెలియును ఎన్నో కఠిన సమస్యలు
కాల ప్రభావాలకు విధిగా అనుభవిస్తే తెలియను ఎన్నో జీవితాల భయభ్రాంతులు
జీవితాన్ని నేర్చుకున్నా తెలియకున్నా జీవించాలి ఎన్నో విధాల ఎన్నో జీవరాసులు
రోగామైనా భారమైనా షాకి ఉన్నా లేకున్నా ఎవరున్నా లేకున్నా జీవించాలి ఎలాగైనా
ఎవరి జీవితం వారిదే ఎవరి కర్మ వారిదే ఎవరి మేధస్సు వారిదే కాని కాలం విశ్వానిదే
విశ్వ లోకంలో ఎలా జీవించాలో తెలుసుకున్నా జీవితం భారమైపోతే విశ్వ విజ్ఞానం ఏమిటో
ఆత్మ తత్వాలతో జీవించే భావాల జీవరాసులు నా మేధస్సులో విజ్ఞానాన్ని అన్వేషిస్తున్నాయి

No comments:

Post a Comment