Saturday, November 13, 2010

మేఘం వెనుకల మెరిసే దివ్య కాంతి

మేఘం వెనుకల మెరిసే దివ్య కాంతి నక్షత్రాన్ని నేను దర్శించాను
రమణీయ కాంతి వర్ణాల తేజస్సుతో తూర్పున నక్షత్రం ఉదయించేను
సూర్యోదయానికి కొన్ని గడియల ముందు ఉదయించే నక్షత్ర కాంతిని నేనే
ఎన్నో నక్షత్రాలు నా మేధస్సులో ఇంకా రమణీయ కాంతులతో ప్రకాశిస్తున్నాయి
నక్షత్రాల లోకాలు నా మేధస్సులో అపురూపంగా ఎప్పటికీ మెరుస్తూనే ఉంటాయి
అనంత రకాలు గల దివ్య వర్ణ తేజస్సులు నా మేధస్సులో మహా భావాలను సృష్టిస్తున్నాయి
విశ్వ విజ్ఞానాన్ని తెలిపే భావాలు నేను తిలకించుటలో నక్షత్రం ఓ మహా లోక దివ్య రూప భావన

No comments:

Post a Comment