మతిపోయిన వారి మేధస్సులోని ఆలోచనలు ఏ భావాలతో కలుగుతాయి
ఆలోచనల అర్థాన్ని ఏ విధంగా గ్రహించి ఏ కార్యాలను చేయగలుగుతారు
అజ్ఞాన విజ్ఞాన భావాల అర్థాల వ్యత్యాసాన్ని గ్రహించి కార్యాలను చేయగలరా
ఏ ఆలోచన భావమైన తమకు తోచిన విధంగా చేయగలుగుతున్నారా
క్రమ కార్య పద్ధతులు తెలియక అశుభ్రతతో సమయాలోచనలు లేక జీవిస్తున్నారు
ఏ పని చేయాలో ఎక్కడ ఏది భుజించాలో ఎప్పుడు నిద్ర పోవాలో బ్రంహకైనా అర్థం కాదే
గత జన్మ కర్మ యోగ పలమా నేటి జన్మలో వేధించే సమస్యల బంధాల చాలని జీవితమా
మతిపోయిన వారి జీవితాలలో మరల దివ్య మేధస్సుతో ఆలోచించేలా విశ్వ విజ్ఞానాన్ని అన్వేషించండి
No comments:
Post a Comment