నీకు తెలియని జీవరాసులు నీ మేధస్సులోనే ఉన్నాయి
నీవు కొత్తగా చూసిన జీవరాసిని కొంత కాలం తర్వాత తలిస్తే ఎక్కడో ఎప్పుడో చూసినట్లు తెలియును
ఆ జీవరాసితో కొంత సమయాన్ని కేటాయిస్తే ఎక్కడో ఆత్మీయ భావం కలుగుతున్నట్లు అనిపిస్తుంది
విశ్వమున ఆత్మ పరంగా అణువులన్నీ ఒక్కటే అలాగే జీవరాసులన్నీ పరమాత్మ ఆత్మ జీవములే
ఆత్మలోని ఎరుక జ్ఞానోదయమైతే విశ్వ విజ్ఞానంగా నీకు ప్రతి జీవరాసి మేధస్సున తెలియును
ప్రతి జీవి ఓ విశ్వమే ప్రతి ఆత్మ నీవే ప్రతి భావన నీ విజ్ఞానం కోసమే జీవించుటలో ఓ ఆత్మ బంధమే
No comments:
Post a Comment