Thursday, November 11, 2010

విశ్వ భూమిని సృష్టించేటప్పుడు

విశ్వ భూమిని సృష్టించేటప్పుడు విశ్వ భూపతిగా నే అదిరిపోయాను
విశ్వ సముద్రాన్ని నిర్మించేటప్పుడు విశ్వ జలపతిగా నే ఆశ్చర్యపోయాను
విశ్వ పర్వతాన్ని నిర్మించేటప్పుడు విశ్వ శికరపతిగా నే భయపడిపోయాను
విశ్వ ఆకాశాన్ని సృష్టించేటప్పుడు విశ్వ మేఘపతిగా నే ప్రయాణించాను
విశ్వ గాలిని సృష్టించేటప్పుడు విశ్వ శ్వాసపతిగా నే నిలిచిపోయాను
విశ్వ సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టించేటప్పుడు నే మెరిసిపోయాను
విశ్వమున ఎన్నో మహా అద్బుతాలను సృష్టించేటప్పుడు భావనగా ఆనాడు నాలో కలిగిన భావాలే
నేను భావనగా ఉదయించి సృష్టించినవే ఈ విశ్వ రూపాలు అలాగే సృష్టించేటప్పుడు గ్రహించిన భావాలు
భావనగా నాకు సృష్టించడానికి ముందే ఈ భావాలు తెలుసు మరలా అవే భావాలను సృష్టించేటప్పుడు గ్రహించా
భావనగా నాకు తెలియకుండా ఏది సృస్టించబడదు నాలో కలిగిన భావాలకు నేను విశ్వంగా రూపమిచ్చాను

No comments:

Post a Comment