విశ్వాన్ని మరవలేను విశ్వ విజ్ఞానాన్ని విశ్వమున ఎక్కడ దాచలేను
మేధస్సున ఎన్నో లోకాలను విశిష్టతగా దివ్య రూపాలతో దాచుకున్నా
నా భూలోకాన్ని మీరు ఎలా చూసుకుంటున్నారోనని భావనగా వచ్చాను
ఏ నగరాలను చూసినా ఏ ప్రాంతమైనా అశుభ్రతగానే కనిపిస్తున్నది
విశ్వ శుభ్రతకై జీవించే మానవుడు ఏ లోకాన కనిపించుట లేదే
అవతార మూర్తులు వెలిసిన భూలోకాన మహా శుభ్రత గలవారు లేరా
మీలో ఒకరిగా నేను ఉదయిస్తాను ధ్యాన భావనను కలిగిస్తాను
శ్వాసగా విశ్వము నేనే ధ్యాసగా మేధస్సును నేనేనని ఆలోచనగా తెలుసుకో
విశ్వాన్ని శుభ్రతగా ఉంచితే విశ్వ విజ్ఞానం మీ మేధస్సులో మీకు తెలియకనే చేరిపోతుంది
No comments:
Post a Comment