Tuesday, November 16, 2010

నేను తలచిన కార్యం ఒకటైతే

నేను తలచిన కార్యం ఒకటైతే జరుగుటలో మరో విధమైన కార్యంగా మారినది
జరుగుటలో మన ప్రమేయం కన్నా కాలానికే బాగా తెలుసనీ నా అభిప్రాయం
ఎప్పుడు ఏది ఎక్కడ ఎలా జరగాలో కాలానికే తెలుసనీ అందుకు అలా జరుగుతుంది
మన కార్యాన్ని ఇతరులకు అప్పగించినా మనకు కావలసిన విధంగా జరగదు
మనము ప్రయత్నించే వారమే గాని కార్య ఫలితము కాలమే నిర్ణయించును
కాల ప్రభావాలు చాలా విచిత్రంగా గ్రహచార దోషాలుగా కూడా సంభవిస్తాయి
చాలా జాగ్రత్తగా మన కార్యాలను చేసుకుంటూ మళ్ళీ ఓ సారి వివరణ చేయాలి
వివరణ లేకపోతే మనం చేసిన తప్పులు చేయలేని చిన్న కార్యాలు తెలియవు
అనుకున్న కార్యాన్ని అనుకున్న విధంగా జరిగేలా వ్రాసుకోండి తర్వాత మళ్ళీ వివరించుకోండి
చాలా సూక్ష్మంగా ఆలోచించి ప్రతి కార్యాన్ని ఎరుకతో క్రమ కార్య విధానంతో చేయండి

No comments:

Post a Comment