Sunday, November 14, 2010

ఆనాటి ఆది కాలమున జీవించిన

ఆనాటి ఆది కాలమున జీవించిన ఆది మానవుల జీవితం ఎటువంటిదో ఎలా సాగిందో
ఏ భావాలతో ఏ రూపాలతో ఏ ఆలోచనల ఏ కార్యాలతో ఏ వయసు నుండి ఎదిగారో
ఆహార కార్యాలు ఎలా మొదలాయేనో భుజించాలని ఆలోచన ఎలా ఏ క్షణాన కలిగిందో
విశ్వమున ఏ ప్రదేశాన ఎటువంటి ప్రకృతిలో మొట్ట మొదటి సారిగా మానవ జీవితం సాగిందో
నీటిలో పర్వతాలలో ఎడారిలో గాలిలో కాదే చెట్లు లేని మట్టి భూమిపై కాదే అడవిలోనేనని నేను
వంద సంవత్సరాలుగా ఎలా ఏ కార్యాలోచన భావాలతో ప్రతి క్షణం కాలా క్షేపం చేశారో
ఎటువంటి అజ్ఞాన విజ్ఞాన భావాలతో వివిధ చేష్టలతో ఆలోచన అర్థాన్ని గ్రహించారో
శరీర స్థితిని ఆరోగ్య అనారోగ్యంగా ఋతు పవనాలతో ఎలా ఎన్ని సంవత్సరాలు ఎవరు సాగించారో
మొదట కలిగే ప్రకృతి స్వభావాలు వారి శరీర స్థితికి ఎలా ఏ విధానాన్ని కలిగించాయో
సుడి గాలిని వర్షపు చినుకులను చలి మంచు కాల భావ ప్రభావాలకు ఎలా భావించారో
మొదటగా చనిపోయిన శరీరాన్ని ఎవరు ఎలా చూశారో ఏ భావాన్ని తెలుపుకున్నారో
కన్నీరు కార్చే భావాలకు ఆత్మ ఆవేదన మేధస్సున ఎలా శోకమై పోయిందో సృష్టికే తెలుసు
ఆనాటి వారికి తల్లిదండ్రుల సోదరుల బంధుత్వాల భావాలు ఏవో తెలియని విధంగా దృషి రూప భావాలే
విశ్వమున కలిగే ప్రతి భావన ఆనాటి నుండి నాకే తెలుసని నా భావన జీవితం తెలుపుతుంది
ఎన్ని తెలిపినా జీవితం చాలదని విశ్వమే ఆగునని అనిపించేలా నాలో అనంత భావాలున్నాయి

No comments:

Post a Comment