మరణంతో నా శరీరము నశించిపోతుంటే మేధస్సులోని కణాలలో దాగిన అనంత భావాలు ఏమగును
నేను సేకరించిన అనంత విశ్వ విజ్ఞాన భావాలు ఒక్కొక్క కణాలలో ఆది కాలం నుండే నాలో దాగినవి
ఇంకా నేను జీవించుటలో ఎన్నో విశ్వ విజ్ఞాన మహా భావాలను సేకరించి మీకు ఎన్నో తెలుపగలను
ఎవరు దర్శించలేని విశ్వ రూప ప్రదేశాలు రమణీయ కాంతుల భావ స్వభావాలు నాలో అనంతమే
నా మేధస్సులో దాగిని ఆత్మ తత్వ విశ్వ విజ్ఞాన మర్మ రహస్యాలు పరమాత్మ తత్వాన్ని తెలుపగలవు
నా శరీరము నశించినా నా భావాలు జీవించే వారి మేధస్సులలో కలుగుతూనే ఉంటాయని నా ఆలోచన
No comments:
Post a Comment