మనస్సు ఎంత మౌనమో అన్వేషించుటలో భావాలను మేధస్సుకే తెలుపుతుంది
మాటలుగా ఏ భావన తెలుపక ఆలోచనలతో అవసరమైనవే మేధస్సుతో పలికిస్తుంది
సుఖ దుఖ్ఖాలైనా ఆత్మతో ఓదార్చుకుంటూ ఆవేదనలనే మాటలతో తెలుపుతుంది
విజ్ఞాన భావాలను తెలుపుతూనే ఎన్నో ఆశయాలను మేధస్సులోనే భద్ర పరుస్తుంది
రహస్యాలను అజ్ఞాన భావాలను ఎన్నో విధాల మన మేధస్సులోనే స్థాన పరుస్తుంది
మన విచక్షణ భావాలకు తగ్గట్టుగా మన మనస్సు మేధస్సుతో ఏకీభవిస్తుంది
No comments:
Post a Comment