అంతర్యామి! అలసితి కలసితి కానరావని తలచితి
జన్మ జన్మలతో యుగాలుగా నీ భావననే స్మరించితి
వయసున కలిగే భావాలను అనుభవముగా నేర్చితిని
కోరికలను కోటి రూపాలలో తీర్చుకోలేక వీడితిని
కలలో కలిగే కీడు అజ్ఞాన కాల ప్రభావ మలినమేనని
జీవించుటలో నీవే నాలో ఉన్నావని శ్వాసనే గమనించితి
మరణించుటలో ఆత్మ పరమాత్మగా అంతర్యామియేనని తలిచితి
No comments:
Post a Comment