సప్త సముద్రాలలో ప్రతి నీటి అణువును నేనై సూర్యోదయ సూర్యాస్తములను తిలకిస్తున్నా
ఆకాశంలో ప్రతి అణువును నేనై సూర్య మేఘ వర్ణ ఆకృతులను దివ్యంగా తిలకిస్తున్నా
సముద్రాన వీచే గాలి అణువులనై అలలతో అంచుల వరకు ఉప్పొంగి కెరటాలుగా ప్రవహిస్తున్నా
చీకటి అణువులుగా నేనై రాత్రి వేళలో నక్షత్ర చంద్రుల కాంతులను అద్భుతంగా మెరిపిస్తున్నా
ఎక్కడైనా కనిపించినా వినిపించినా తెలిసినా ఊహించినా అణువులుగా ప్రతి భావనను నేనే
No comments:
Post a Comment