ఓ క్షణంలో ఓడిపోయిన వారు ఎందరో ఉన్నారు
ఓడిపోయి మరణించిన వారు విశ్వమున ఎందరో
క్షణ వ్యత్యాసంతో ఓడి సరైన జీవితాలు లేక ఎందరో ఉన్నారు
క్షణ వ్యత్యాసంతో గెలిచిన వారి జీవితాలు విజయమే
ఎంతో కాలం శ్రమించి ఓడిపోవుటలో జీవితమే విచారం
నిమిషం ఆలస్యంతో ఎన్నో ఎందరో పోగొట్టుకున్నారు
గంటల సంవత్సరాల ఆలస్యంతో ఎన్నో వెళ్ళిపోయాయి
జీవితాలు తారుమారు అయ్యేవి కాల సమయాలతోనే
జీవితంలో ఎన్ని ఎలా జరిగిపోయినా అవి కాలానికి ఇష్టమేనని గ్రహిస్తే మన జీవిత భావాలు విజ్ఞాన ఆనందమే
No comments:
Post a Comment