Thursday, October 28, 2010

నేత్రాలు చీకటైన వారికి జ్ఞానేంద్రియాలలో

నేత్రాలు చీకటైన వారికి జ్ఞానేంద్రియాలలో విచక్షణ తత్వాన్ని మేల్కొల్పండి
సూక్ష్మ పరిశీలన పరిజ్ఞాన తత్వ భావాలను జ్ఞానేంద్రియాలతో తెలుసుకోవాలి
ప్రతి క్షణాన జరిగే విషయాలను కీలకంగా జ్ఞాపకంగా గమనిస్తూ ఉండాలి
గత కార్య భావాలు భవిష్య కాలానికి విజ్ఞాన సమయ స్పూర్తిగా నిలుస్తాయి
ఎంత ఎరుకతో జీవిస్తే అంత గొప్పగా విజ్ఞాన జీవితం భావాలతో సాగిపోతుంది
ఎంతటి వారైనా స్వతహాగా ఆర్థికంగా వృత్తి పరంగా జీవించేలా సమాజం చూస్తుంది
స్వతహాగా మన పని మనం చేసుకోలేకపొతే సహాయం చేసేవారు ఎంతవరకు ఉండగలరు
మంచి జీవితం కోసం మహా భావాలతో గొప్పగా విజ్ఞానంగా జీవిద్దాం

No comments:

Post a Comment