ప్రతి క్షణమున గతమంతా భవిష్య కాలమంతా మేధస్సుకు తెలుస్తున్నది
క్షణంలో తెలిసినదంతా ముగిసినా మరో క్షణంలో మరల గుర్తుకొస్తున్నది
క్షణ క్షణాలుగా ప్రతి క్షణం అన్నీ తెలుస్తూనే కాలం మేధస్సులో సాగుతున్నది
వర్తమాన క్షణంలోనే భూత భవిష్య విషయాలను నెమరువేసుకుంటున్నాను
ప్రతి క్షణం నాదే విశ్వ కాలాన్ని నేనే నేను లేనిది ఏదీ లేదని శూన్యమైనా నేనే
No comments:
Post a Comment