రాజ్య సామ్రాజ్య పాలన లేక వ్యాపార నిమిత్తం లేక కొన్ని వేల ఎకరాల భూ స్థలాన్ని ఆస్తులుగా కలిగి ఉండటం అధికార పెత్తనమే -
ప్రపంచమున ఓ అంగుల స్థలము లేక స్వంత ఇల్లు లేక నివసించు వారు ఎన్నో కోట్లలలో శ్రమిస్తూ నిరాశతో జీవిస్తూనే ఉన్నారు -
ఆనాటి ఆలోచనతో అధికారంతో ఆక్రమించుకున్న భూములు భవిష్య ప్రజలకు తెలియని అజ్ఞానమేనని జీవన పరిస్థితుల సమస్యలతో తెలుస్తున్నది -
వందల ఎకరాల భూములు ఆస్తులుగా కలిగి ఉండటం రాజ్య సామ్రాజ్య వ్యాపారం లేక ఎలా సాధ్యమో మేధస్సుకు తెలియటం లేదు -
ధైర్య వంతుడే దేశాన్ని దోచుకుంటే దేశ రక్షణ ఎలా సాధ్యమో విశ్వమున అంతులేని అజ్ఞానమై విజ్ఞానవంతుడు ధైర్యం లేక జీవిస్తున్నాడు -
వేల ఎకరాలు కలిగిన వారు కనీసం కొందరికైనా గృహ వసతి వ్యవసాయం కలిపిస్తే విజ్ఞాన ఆలోచనగా కొందరి జీవితాలు మెరుగుపడతాయి -
నేటి కాలంలో సంపాదించినదంతా ఇంటి ఖర్చులకు సరిపోతే వసతి కోసం స్థలాన్ని కొనడానికి చేత కావటం లేదు -
జీవితాంతం శ్రమించినా వసతి కోసం స్థలాన్ని కొనలేకపోయేలా నేటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి -
స్థలాలు లేక ఇల్లుపై ఇల్లు ఎన్నో ఇళ్ళను చాలా చిన్నవిగా ఇరుకుగా కట్టేస్తున్నారు -
ప్రభుత్వమైనా సరైన నిర్ణయం తీసుకోలేకపోతే విశ్వమున దొంగలు భిక్షాదిపతులు అనారోగులు అన్యాయంతో కూడిన అజ్ఞాన ధైర్యవంతులు ఎందరో ఉంటారు -
అధికారులే కొన్ని వందల ఎకరాల భూములు కలిగి ఉంటే భవిష్యత్ లో అడవులు కూడా చాలవు -
విశ్వమంతా గృహాలతో నిర్మితమైతే వ్యవసాయ భూములు కరువై జీవన విధానాలు మారిపోతాయి -
సహజత్వ జీవన విధానం లేక కృత్రిమ జీవన విధానంతో శ్వాసకు ప్రాణ వాయువును కొనే కాలం వస్తుంది -
జీవన విధానాలు మారిపోవడానికి సరైన స్థలాలు సదుపాయాలూ లేక సరైన ఆలోచనలు లేవు -
విశ్వాన్ని మార్చే విధంగా భూస్థలాన్ని అందరికి న్యాయంగా పంచేలా ఎవరికి ఎంత అవసరమో అంతే సర్దేలా నాలో విజ్ఞాన చైతన్య ఆలోచనలు ఉన్నాయి -
విశ్వాన్ని సమస్యలు లేకుండా తీర్చే పద్ధతులు జీవన విధానాలు మహా కార్య క్రమ కాల ప్రణాళికలు నా మేధస్సులో ఎన్నో విశ్వ విజ్ఞానంగా ఉన్నాయి -
జన సంఖ్య తగ్గితే చాల సమస్యలు తగ్గిపోతాయని విజ్ఞాన పరిష్కారంగా నా మేధస్సులో ఎప్పటి నుండో ఉన్నది -
ఇలాంటి విషయాలు తెలుసుకున్న తర్వాత ఎందరికో తెలిసేలా విజ్ఞాన ఆలోచనలు తెలియజేయండి సమాజం విజ్ఞానంగా మారవచ్చు -
మరచిపోయే భావన మీలో ఉంటే ఎవరి జీవితాలు సుఖమయం కావు విజ్ఞానంగా మహా భావాలోచనలతో సాగితేనే విశ్వ ప్రపంచం శాంతిమయం -
No comments:
Post a Comment