ప్రతి అక్షరం ప్రతి పదం ప్రతి నామం ప్రతి వాఖ్యా విజ్ఞానం మానవునికే తెలుసు
ఇతర జీవులకు ఏ నామం తెలియదు ఏ పద అక్షర విజ్ఞాన సాంకేతిక ప్రజ్ఞానం తెలియదు
మనం పెట్టిన ఆ జీవి పేర్లు వాటికే తెలియదు ఏ జీవికి తెలియని విజ్ఞానం మనకే తెలుసు
మానవులకు తెలిసినట్లుగా ఏ జీవికి విశ్వ విజ్ఞానం తెలియదంటే మానవ జన్మ అద్భుతం
ఇతర జీవులు భావాలతో సహజత్వ జీవితాన్ని గ్రహిస్తూ జీవిస్తాయి
మానవుడు సహజత్వం నుండి కృత్రిమ జీవితం వరకు ఎన్నో విధాల జీవిస్తున్నాడు
ఏ జీవికి ఏ కృత్రిమ వస్తువులు యంత్రాలు సాంకేతిక విజ్ఞానం అవసరం లేదు
వైద్యం కూడా తెలియని అనారోగ్యముతో జీవిస్తున్న జీవులు సహజత్వ సామర్థ్య మహా జీవులే
ప్రతి జీవిలో ఉన్న భావాలు మానవునిలో ఉన్నాయని ఆత్మ పరమార్థం
మానవుని గొప్పదనం ఆలోచన విజ్ఞాన మేధస్సు ప్రభావిత భావార్థ విధానాన్ని గ్రహించుటయే
మానవుని రూప సౌష్టవము కూడా సాంకేతికంగా ఎదగడానికి విజ్ఞానం చెందడానికి మూలాధారము
No comments:
Post a Comment