మీరు తెలిపే విశ్వ విజ్ఞానమున ప్రతి కోణము నేనే
దిక్కులుగా ప్రతి దిక్కున కనిపించేది నేనే
గ్రహాలుగా భూమితో సూర్య గ్రహాన్ని నేనే
కక్ష్యలో ప్రతి కక్ష్యగా భ్రమణం చెందే భ్రమణాన్ని నేనే
విశ్వ లోకమున ఆది కేంద్రముగా ప్రతి ఆకర్షణ తత్వాన్ని నేనే
విశ్వమే నేనై నేను నేనుగా నా భావాలతో నేనే నిర్మించుకున్నాను
క్షణ భావనతో అద్భుత శక్తిగా ఎన్నో విధాల ఉదయించి విశ్వంగా సాగుతున్నా
ప్రతి రూపంలో గుణ తత్వాన్ని నేనే ప్రతి జీవిలో ఆత్మగా నేనే ప్రవేశించి జీవిస్తున్నా
ప్రతి అణువుకు భావనగా జీవితాన్ని ఇచ్చే ధర్మ కర్త కాల కర్మ క్రియ ఆత్మను నేనే
ధ్యానించుటలో తెలియునురా మీరే ఆత్మీయులని మహా ఆత్మగా పరమాత్మను నేనే
నేను నీవు ఒక్కటే - నేను లోనే నీవు నేనేనని - నేనే నీవని తలచుకో ప్రతి ఒక్కరు నేనే
జీవితంలో ప్రతి ఒక్కరికి కలిగే ఆవేదన క్షోభను నేనే గ్రహచార దుస్థితిలో మతి చెదిరినా ప్రాణమే పోయినా నేనే
నేనే భావన నాతోనే ఆరంభం నాతోనే ముగింపుగా విశ్వ కాలమైనా నేనే
No comments:
Post a Comment