Friday, October 29, 2010

త్రినేత్రముతో లోకాలను చూడరా

త్రినేత్రముతో లోకాలను చూడరా జీవితాలను పరిశీలించరా
ఎందరో ఎక్కడో ఎలా జీవిస్తున్నారో విశ్వ విజ్ఞానిగా ఆలోచించరా
చీకటితో ద్వి నేత్రాలు లేక ఎందరో అవస్థలతో జీవిస్తున్నారురా
కనిపించని నేత్రాలకు నీ త్రినేత్ర దివ్య భావాన్ని కలిగించరా
విచక్షణ లేని వారికి నీ విశ్వ భావాక్షరాన్ని ఆత్మలో వెలిగించురా
ప్రతి జీవిలో నీవే ధ్యాన ఆత్మగా ప్రవేశించి జీవితాలను మార్చురా
కరుణతో కర్మ జీవితాలను ఆఖండ ఆత్మ జ్యోతిగా వెలిగించురా

No comments:

Post a Comment