ప్రతి రోజు నీవు ఏ ఆలోచనతో మేల్కొంటావు
నిన్ను మేల్కొలిపే ఆలోచన ఏ క్షణాన కలుగుతుంది
మెలకువ వచ్చిన మరల నిద్రపోతే ఆ ఆలోచన ఎలాంటిది
ఎటువంటి ఆలోచన కలిగితే మరల నిద్రించక మేల్కొంటావు
ప్రతి రోజు కలిగే మెలకువ అదే క్షణాన అదే ఆలోచనతో కలుగుతుందా
ప్రతి రోజు మరో క్షణాన మరో ఆలోచనతో మేల్కొంటావా
మన ఆలోచన విధానం వలన మనం చేయబోయే కార్యాల ద్వారా మనం మేల్కొనగలము
మనం నిద్రించే సమయం నిద్రపోయిన క్షణం మరల నిద్రపోయే స్థితి ద్వార మేల్కొనగలము
కొన్ని రోజులు మనం అనుకున్న సమయానికి మేల్కొలేకపోతుంటాము
అనుకున్న సమయానికి మేల్కొనే ఆలోచన వృత్తి కార్యముపై ఆధారపడి ఉంటుంది
కార్య దీక్షకు కావలసిన సమయం లేనప్పుడు త్వరగా మేల్కొంటాము
అనుకున్న కార్యాన్ని ముగించాలనుకుంటే అనుకున్న సమయానికి మేల్కొనగలము
No comments:
Post a Comment