కరుణతో సాగిపో కర్మ కాలమైన త్యాగమే చేసిపో జన్మతో కారణమై విశ్వాత్మగా జీవించిపో
మహాత్మవు నీవే మహా గుణ భావ తత్వానివి నీవే విశ్వ విజ్ఞాన దివ్య స్పూర్తివి నీవే
భావాలతో జీవించు ఆలోచనలతో కాలాన్ని సాగించు ఆధ్యాత్మ తత్వంతో సత్యాన్ని మేల్కొలుపు
విశ్వ అణువులలో ప్రతి అణువు స్వభావాలు నీవియేనని మర్మ ధ్యాసతో క్రొవ్వొత్తిలా కరిగిపో
No comments:
Post a Comment