ద్వి నేత్రాలు దేనిపై దృష్టి పెట్టునో దానిని నీవు చూడగలవు
ఒకే నేత్రముతో దేనిని చూస్తున్నా ఆ రూపాన్ని గ్రహించలేవు
కొన్ని సమయాలలో ఒక నేత్రంతో చూసిన దానిని గ్రహించవచ్చు
ద్వి నేత్ర దృష్టి సమపాలలో ఉంటేనే ఒక రూపాన్ని కేంద్రీకరించగలవు
ద్వి నేత్రాలు కేంద్రీకృతమైనప్పుడు చూసిన రూపాలు మేధస్సులో ఉండిపోతాయి
ద్వి నేత్ర దృష్టితో ఎన్నో రూపాలను చాలా త్వరగా ఎన్నింటినో గుర్తించుకోవచ్చు
ఒక నేత్రం ఒక దానిపై మరొక నేత్రం మరో దానిపై దృష్టి పెడితే సరిగ్గా గ్రహించలేవు
ఒక నేత్రం కలవారు ఒక దానిపైననే దృష్టి పెట్టి చూడగలరు గ్రహించగలరు
రెండ నేత్రాలు ఒక దానిపై కేంద్రీకృతం కాకపొతే నేత్రాలలో సూక్ష్మ కణ లోపం ఉన్నట్లే
No comments:
Post a Comment