Monday, October 11, 2010

పేద వాడికి ప్రభుత్వమంటే నిత్యం

పేద వాడికి ప్రభుత్వమంటే నిత్యం భయమే
జీవించాలంటే జీవనమే భారమై పోతున్నదే
వచ్చినది వచ్చినట్టే ఎన్నో విధాల వెల్లిపోతున్నదే
ఆహారానికి ఆహార వస్తువుల పన్ను ఎందుకో
త్రాగే నీరుకు నీటి పన్ను ఎందెందులకో
నివసించుటకు గృహ పన్ను ఎందులకో
వెలుగుకై విద్యుత్ పన్ను ఎందుకో
శ్రమించుటకు సంపాదన పన్ను ఎందుకో
అధిక ఆస్తికి అక్రమ విచారణ ఎందుకో
చదివేందుకు విద్యా పన్ను ఎంతవరకో
నెలకు ఎన్ని పనులు చేస్తూ ఎన్ని పన్నులు కట్టాలో
చికిత్సకు చిత్రమైన పన్నులు కూడా వస్తాయిలే
పన్నులు కట్టడానికే మనిషి శ్రమించాలిలే
జీవించుటలో ఎదుగుదల లేక తల పన్ను భారమే

No comments:

Post a Comment