Monday, October 4, 2010

అతని పేరు తలిస్తే - చిరంజీవి

అతని పేరు తలిస్తే విశ్వ దేవతలు స్మరిస్తూ ఆశీర్వదిస్తారు
మనిషికి ఏ మనిషైనా దీవించుటలో అతని పేరే ఆశిస్సులే
యుద్ధానికి వెళ్ళుతున్నా విజయానికైనా అతని పేరే ఆశిస్సు
ఆ పేరు వింటేనే ప్రతి జీవిలో కదిలేనే మరో భావ హృదయం
చిరస్మరనీయుల జీవితాలు తన పేరుతోనే నిలిచిపోతాయి
తన పేరే తనకు దీవేనగా మహా నక్షత్రమై మనలోనే నిలిచాడు
మరణంలేని మహా రాజైనా రారాజైనా తన పేరే తన సొంతం
విజయాలకు విశ్వ మూర్తి దీవించేదే తన నామ ధ్యేయం
విజయం కోసం తన కుమారునికైనా దీవించేదే చిరంజీవీ భవ
విశ్వమున ఓ మహా మనిషిగా జీవిస్తున్నాడు చిరంజీవియే
ప్రతి మనిషి నామమునకు ముందుగా తన పేరే చిరంజీవ
దీర్ఘ కాలంగా జీవిస్తున్న వారంతా మహోన్నత చిరంజీవులే
జగతిలో ఓ దేశపు రాష్ట్రాన అందరిలో ఒకరిగా చిరంజీవియే
మహాత్ముల భావాలకు మహా సంకల్పం చిరంజీవ చిరంజీవ
విశ్వ కార్యాలను ఆధ్యాత్మ భావాలతో చేయగలిగితే విశ్వజీవియే
విశ్వ జీవిగా చిరంజీవి ఎదగాలని నా భావన చిరంజీవికే

No comments:

Post a Comment