నేటి కాలమున మెరిసే మెరుపులన్నీ నా నుదుటిపై ఉన్న గీతాలే
ఆనాడు మెరిసినవన్నీ నా నుదుటిపై విజ్ఞానముకై దాచుకున్నా
ఏ మెరుపు ఎప్పుడు మెరిసినా ఆ భావం నా నుదుటిపై చలిస్తుంది
భయంకరమైన మెరుపులు డీకొన్నప్పుడే పిడుగులు రాలుతాయి
విద్యుత్ తీగలా మెరిసే మెరుపులు డీ కొంటే నాలో మహావతారం
మెరుపు వెలుగుకు నా రూపం భయంకర కాంతిగా మారుతుంది
అగ్ని జ్వాలలు కూడా నాలో ఎన్నో అద్భుతాలుగానే ఉన్నాయి
No comments:
Post a Comment