నా భావాలను చదవడానికే జీవితం చాలకపోతే అర్థమగుటకు ఎన్ని జన్మలు
అర్థాలలో స్వభావాలను గ్రహించుటకు ఎన్ని యుగాలు కావాలో తేల్చుకోగలవా
స్వభావాల జీవితాలు ఎలా ఉంటాయో తెలుసుకొనుటకు ఎన్ని ప్రళయాలో
భావాలతో జీవించుటకు విశ్వ కాలమైనా సరిపోదని ప్రయాణించుటలో తెలియునా
భావమేలేని శూన్యముగా నిలిచిపోవుటకు ఏ కాలం అవసరంలేనట్లు ఆనాడే
No comments:
Post a Comment