Friday, May 14, 2010

మనస్సు ఎప్పుడూ

మనస్సు ఎప్పుడూ అన్వేషణగా ప్రతి జీవిలో చలిస్తూ ఉంటుంది
మనస్సు లేకపోతే ఏ అన్వేషణ లేక అన్నీ ఆగేలా చేస్తుంది
శ్వాస కూడా ఆగి ఆలోచనలను కూడా ఆపుతుంది
మనస్సే ప్రతీది నడిపిస్తూ ఆలోచనలతో జీవింపజేస్తుంది
శ్వాసను బందిస్తే మనస్సే ఆలోచనగా ఊపిరి కావాలని
మనస్సు విజ్ఞానంగా ఎదిగినందుకు ఆలోచనగా తెలుపును
విజ్ఞానం లేకపోతే భావనగా మేధస్సుకు తెలుపుకుంటుంది
పసిపిల్లలకు ఆలోచన విజ్ఞానం లేనందున భావనగా తెలిపేను
మనస్సే ఒక ఆలోచనతో మనల్ని ముందుకు నడిపిస్తుంటుంది
మనస్సు లేకపోతే ఆలోచన/భావన లేక శ్వాస ఆగేలా చేస్తుంది
మరణించిన తర్వాత శ్వాస మనస్సు ఆత్మ మూడూ వెళ్లి పోతాయి
విశ్వ కాలానికి కూడా మనస్సు ఉందని ప్రతి క్షణమున తెలియును

No comments:

Post a Comment