లోకమంతా ఓ విజ్ఞానంతో వెళ్ళుతుంటే నాను మాత్రమే విశ్వ భావాలతో సాగుతున్నా
ఎవరికి ఏ విజ్ఞానం కావాలో ఆ మార్గములోనే అన్వేషిస్తున్నా నేను మరో మార్గంలో
విశ్వమున ప్రయాణిస్తూ రూపాలనే చూస్తూ కాలంతో భావాలను గ్రహిస్తూనే ఉన్నా
సమాజ సాంకేతిక విజ్ఞానంతో అందరూ వెళ్ళుతున్నా నా భావాలు విశ్వం వైపే
విశ్వంలోనే అన్ని భావాలను తెలుసుకోవచ్చని నా ఆలోచన సాగుతున్నది
మేధస్సులో అన్వేషణ ఉన్నంతవరకు ఆలోచన ఏ విజ్ఞానం వైపైనా సాగుతూనే
నడిచే మార్గం ఎలాంటిదైనా విజ్ఞాన సత్యం ఉంటే అదే మహా మార్గంగా విశ్వంలో
No comments:
Post a Comment