మనస్సు క్షణానికి చాలా రకాలుగా మారుతూ ఉంటుంది
మనస్సు ఎప్పుడూ చలిస్తూనే ముందుకు సాగుతుంటుంది
ఒక ఆలోచనను మనస్సే ముందుకు ఆలోచింప జేస్తుంది
ముందుకు ఆలోచించే ఆలోచన లేదంటే ఆలోచన కలగవు
ఆలోచన లేకపోతే మేధస్సు సరిగా పనిచేయకుండా పోతుంది
మేధస్సు ఆగిపోయిందంటే శ్వాస ఆగి మరణం సంభవిస్తుంది
మనస్సు లేకపోతే ఏ జీవి జీవించదని ఖచ్చితంగా తెలుస్తుంది
మనస్సుకు చాల గుణ భావాలు ఉన్నందునే ముందుకు సాగేలా
మనస్సు మేధస్సును ఏదో ఒక పనిని చేయిస్తూనే ఉంటుంది
శ్వాసలోనే మనస్సు ఉన్నట్లు ఉచ్చ్వాస నిచ్చ్వాసలో తెలియును
విశ్వ కాలానికి కూడా అన్వేషణ అనే మనస్సు స్వభావమున్నది
అన్వేషణగా విశ్వ కాలము భవిష్య భావాల కార్యాలతో సాగుతూ
మనస్సే విశ్వానికి మూల ఆరంభ శక్తి భావ మహా చలనము
మనస్సుతోనే ప్రతీది కలుగుతున్నట్లు నా అన్వేషణలోని భావన
No comments:
Post a Comment