ఎదుటివారికి తగ్గట్లుగా అందరితో స్నేహ స్వభావంతో ఉండగలగాలి
ఎవరు ఎంత గంభీరంగా అజ్ఞానంగా మాట్లాడిన మనం సత్య భావనతో
చిన్నవారి నుండి పెద్దవారి వరకు విజ్ఞాన భావాలతోనే మాట్లాడాలి
అందరు మాట్లాడే అజ్ఞానం మనకు అవసరంలేదు మనమే విజ్ఞానంగా
హోదా ఉన్నా అందరితో సమానత్వం సమయానికి సమన్వయం ఉండాలి
ఎక్కడంటే అక్కడ ప్రవర్తన మార్చవద్దు ఎప్పటికీ ఎక్కడైనా ఒకే విధంగా
ఏ చెడు అలవాట్లు చేసుకోవద్దు అవి ఆవేదనలతో మాట తీరును మార్చేస్తాయి
సరిలేని ప్రవర్తనను మార్చుకోవాలంటే ధ్యాన సాధనయే మంచి విజ్ఞానం
ప్రతి మాట ప్రతి పదము భగవంతుని శ్వాస నుండి స్వరంలో కలిగేదే
విశ్వ వేద మర్మ రహస్యాలను అర్థవంతంగా తెలిపేవి మహా మాటలే
ఎలా అంటే అలా ఏ మాటంటే ఆ మాట పలకకుండ విజ్ఞాన పదాలే నోట
ఒకరిని అజ్ఞానిగా చేసే మాటలు మార్చే విధానాన్ని మానుకోండి
No comments:
Post a Comment