నిన్ను వీడని నీ శ్వాస నీతో ఎందుకు జీవిస్తున్నదో తెలుసుకో
నీవు లేని లోకం విశ్వంలో నాకిక ఏ భావన కలగని అజ్ఞానమే
నీవు ఉన్నంతవరకు నేను ఏ రహస్య భావననైనా తెలుపగలను
నీవు నన్ను గమనిస్తే మరణమేలేని భావనను నీకు తెలుపుతా
విశ్వంలో దాగిన ఎన్నో రహస్యాలు నాలో అనంతంగా ఉన్నాయి
నా పై ధ్యాస ఉంచి ధ్యానిస్తే నీకు విజ్ఞాన దివ్య కమలాన్ని ఇచ్చేస్తా
నాలో ఉన్న సత్య భావనలు ఇక ఎవరు కలగించరని తెలుసుకో
No comments:
Post a Comment