Sunday, May 23, 2010

విజ్ఞాన రహస్యాలు మీలో

విజ్ఞాన రహస్యాలు మీలో ఉంటే మీ వాళ్ళకైనా తెలపండి
మీ రహస్యంతో వారు మరో రహస్యాన్ని తెలుసుకోవచ్చు
మీకు కూడా ఎన్నో రహస్యాలు తెలిసే సమయం రావచ్చు
రహస్యాలతో మీరు ఇంకా విజ్ఞానంగా ఎదిగే అవకాశం వస్తుంది
తక్కువ సమయంలో ఎక్కువ ఉపయోగాన్నిచ్చే రహస్యాలెన్నో
విజ్ఞానం రాను రాను కొరతగా ఎంత ఉన్నా చాలదన్నట్లుగానే
కార్య కారణ భావ సూత్రాలను గ్రహిస్తే రహస్య విజ్ఞానమెంతో
ఏకాగ్రతగా ప్రతి కార్యాన్ని గమనించండి రహస్యాలు అనంతమే
ఎవరికి తెలియని రహస్యాలు మీ మరణంతో వెళ్ళితే అజ్ఞానమే
ఎన్నో విజ్ఞాన రహస్యాలను తెలుసుకునేందుకు సాంకేతిక యంత్రాలే
సాంకేతిక యంత్రాల విధాన విజ్ఞానము మర్మ రహస్యమువలె
సూక్ష్మముగా పరిశీలించి తెలుసుకుంటేగాని అర్థంకాని శాస్త్రంగా
సమయం కేటాయించుటలోనే రహస్యాలు తెలుసుకునే విజ్ఞానం
ఏ విధంగా ఏ రహస్యం తెలుస్తుందో కాల మేధస్సుకే తెలుసనీ
ఎవరికి తెలుపకూడని రహస్యమైతే నీ మేధస్సులో అజ్ఞానం కారాదు
నీకు అజ్ఞానమైన రహస్యం జీవితాన్ని నాశనం చేస్తుందనే నేను
ప్రతి రహస్యం విజ్ఞానంగా ప్రతి ఒక్కరి మేధస్సులో వెలగాలి
రహస్యమే విజ్ఞాన అనుభవము అదే జీవితానికి మార్గ దర్శకం
రహస్యాన్ని తెలుసుకునేందుకైనా జీవిస్తే మరణంలేని రహస్యం తెలియునా

No comments:

Post a Comment