నాలో ఉన్న భావాలే విశ్వమున ఇంకా ఉన్నాయని కాలంతో అన్వేషిస్తున్నా
నా మేధస్సులో చేరే క్షణాలకై నేను విశ్వముననే సూక్ష్మమై వేచియున్నా
ఆనాటి నుండి తెలుసుకుంటున్నా నా భావాలు ఇంకా అనంతమేనని తెలిసేను
స్వభావాలతో నా భావాలు అనంతమై పోతున్నాయని కాలమే తెలుపుతున్నది
స్వభావాల తత్వాలు కూడా ఇంకా ఉదయిస్తూనే ఉన్నాయని విశ్వమే సూచిస్తున్నది
నా మేధస్సు అలాగే ఉన్నా భావాల విజ్ఞానం అనంతమై పోతుందని నాకు మాత్రమే తెలుసు
No comments:
Post a Comment