పెళ్ళైతే కొన్ని బంధాలు దగ్గరవుతాయి కొన్ని దూరమవుతాయి
పెళ్ళితో కొత్త బంధాలు ఏర్పడి ఎవరి నెవరినో కలుపుతూపోతాయి
పెళ్ళితో కుటుంబ భాద్యత పెరిగి మన కుటుంబం పైననే ధ్యాస
భాద్యతతో దూర సంబంధాలు ఇంకా దూరమగుటకు అవకాశం
కొత్తవారితో కొత్త సమస్యలు కూడా కలగటానికి మరో అవకాశం
ఏ బంధాలు ఎలా సాగుతాయో కాలమే మనకు దారి చూపును
ఏ బంధం ఏర్పడిన మనలో మంచి భావనలు ఉంటే బాగుంటుంది
No comments:
Post a Comment