నాకున్న కర్మలు చాలు రాబోయే వారికి ఎందుకో అనుభవించలేక
ఉన్న కర్మలే నశించిపోవుటలేదు తరిగించుకున్నా పెంచుతున్నారే
ప్రస్థుత కాలమున అన్నీ సమస్యలేగాని సుఖాలు క్షణాలలో మాయం
సుఖాలతోనే కస్టాలు నష్టాలు కలుగునని నా నుదిటిపై వ్రాసియున్నారు
సుఖజీవిగా జీవించమని వ్రాస్తే జన్మించిన తర్వాత అది కర్మజీవిగా మారేను
నేడు జన్మించబోయేవారికి కర్మజీవిగా జన్మించి నశింపజేసుకోమని వ్రాసెదరు
కర్మ నాశనమునకు ధ్యాన మార్గమొక్కటే మహా గొప్పదని తెలుస్తున్నది
No comments:
Post a Comment