Saturday, May 22, 2010

నేను మొదలు పెడితే

నేను మొదలు పెడితే ఆరంభము నుండి అంతము వరకు విశ్వంలో ప్రయాణిస్తూనే విజ్ఞానాన్ని మేధస్సున సేకరిస్తూ భావాలతో ఆలోచనలుగా సాగుతూ ప్రతి భావార్థాన్ని తెలుసుకుంటూ పరిశీలిస్తూనే శ్వాస తెలుపుతున్నది ఇలా నీ ప్రయాణము విశ్వము ఆగినా ఎప్పటికీ కాలంతో అలజడి అలసట లేక అన్వేషణగా సాగుతూనే మర్మముగా మరో ధ్యాసలో మరణము లేక అమర జీవుడిలా అహింసా హంసలా సత్యాన్ని గ్రహిస్తూ శూన్యమును చేరి బ్రంహాండమునకే సూక్ష్మ కేంద్ర కాంతి బిందువులా అమృత తత్వంతో నిలిచి ఎప్పుడు ఎలా ఉంటానో ఎవరికి తెలియని విధంగా ప్రకృతి స్వభావాలలో ధ్యానిస్తూ ఆకాశ కమలత్వాన్ని ధరించి నేను నేనుగా లోకానికి కనిపించని కరుణా మూర్తిలా మీ భావాలలో మనస్సునై మీకు తెలియనట్లు శ్వాసగా ప్రవేశించి జనన మరణాల కర్మ శాస్త్ర జీవిత జీవన విధానమున సృష్టింపబడి ఉంటాననే

No comments:

Post a Comment