నేను మరణించిన విషయం ఎవరికి తెలియనివ్వకండి
నేను మరణించినట్లు తెలిస్తే విశ్వమంతా నా ప్రదేశానికి తరలి వచ్చును
కదిలే ప్రతీది నా యందు చేరుటకు వస్తుంది జీవి ఐనా గాలి ధూళి ఐనా
ఆకాశము కూడా నాకై వచ్చి యున్నట్లు నిర్మానుషంగా ఉంటుంది
విశ్వమంతా ఏ శబ్ద ధ్వని తరంగాలు లేక కొన్ని క్షణాలు మౌనమే అన్నట్లు
నా శరీరములో నిలిచిపోయిన ప్రతి భావము మీ మేధస్సులో వెలుగుతుంది
విశ్వమంతా కలిసిన ఆ ప్రదేశమే దివ్య క్షేత్రంగా జగతిలో మహా స్థానమవుతుంది
విశ్వ భావాలు కలుగుటకు ఆ ప్రదేశం ఆధ్యాత్మక ప్రదేశంగా నిలిచిపోతుంది
ప్రవర్తనలో లేని జీవితాన్ని ఆశించవద్దు సుఖపడే మార్గమున ప్రయాణించవద్దు
రాలేకపోయినవారు రానట్లేనని భావించవద్దు వారి భావాలు మీకన్నా ముందే చేరాయి
ఏ సందేహమైనా తీరిపోయేది శ్వాసలోనే విజ్ఞానమైనా శ్వాసతోనే అదే నా మరణ వార్త
No comments:
Post a Comment