Wednesday, May 26, 2010

ఆకాశంలోనే నా రూప భావాలు

ఆకాశంలోనే నా రూప భావాలు ఉన్నాయని నేను చూస్తున్నాను
పగలు నేను తిలకించే భావాలన్నీ నా మేధస్సులో చేరిపోతాయి
రాత్రి వేళ ఆ భావాల సారంశ చిత్రాలే నా నేత్రాలలో కనిపిస్తాయి
నా భావ చిత్రాలు ఆకాశంలోనే అద్భుతాలుగా దర్శనమిస్తున్నాయి
ఆకాశంలోనే నా భావ చిత్రాలను రాత్రి వేళ కలలో తిలకిస్తున్నట్లు
నేను చూసే సూక్ష్మ రూపాలు ఆకాశాన మహా రూపాలుగా
నా మేధస్సులో ఎన్ని అద్భుతాలు కలవో ఆకాశానికే తెలియనట్లు
కొన్ని మహా రూపాలకు ఆకాశం చాలదన్నట్లుగా తిలకిస్తున్నా
నా మేధస్సు భావాలతో చిత్రాలకై ఆకాశ వైశాల్యాన్ని పెంచుతున్నా
ఆకాశం నాలో ఎంత అద్భుతంగా ఉందంటే నేటి సాంకేతిక విజ్ఞానమే
ప్రతి విజ్ఞాన రూపాన్ని నేను ఆకాశముననే దివ్యంగా చూస్తున్నా
ఆకాశం నా స్వభావాలకు ప్రతి రూపమని మేధస్సులో లిఖించుకున్నా

No comments:

Post a Comment