మహా భావనతో వేచి ఉన్నాను ఓ గొప్ప ఆలోచనను పంపగలరని
ఆలోచనను తీసుకు వెళ్ళే గాలి స్వభావము ఇంకా కలుగుటలేదని
విశ్వమున నిలిచి ఆలోచన రాకకై గాలి కోసం ఎదురు చూస్తున్నా
దివ్యమైన గాలి ఏ స్వభావంతో ఎలా ఎక్కడి నుండి దేనిచే వస్తుందో
మేధస్సును తాకే ఆ ఆలోచన మర్మముగా తెలిపే రహస్యమేదో
గాలితో విశ్వమంతా నా శ్వాసలో చేరి మేధస్సును ఆలోచింపజేసింది
ఆలోచనతో వచ్చిన ఆ భావన గాలి తెలిపే మర్మము కూడా శ్వాసలోనేనని
శ్వాసలోనే ప్రతి భావ ఆలోచన మర్మ రహస్య స్వభావాలు ఎన్నో అనంతమే
No comments:
Post a Comment