నా కర్మను చాలా విశాలంగా మహా గొప్ప భావాలతో ఆకాశాముననే లిఖించారు
ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా చదువుకోవడాని వీలుగా ఆకాశాముననే
మర్మముతో కూడిన కర్మ రహస్యాలను రహస్యంగా మేఘ వర్ణాలతో లిఖించారు
భావాలు తెలిసిన వారికే రహస్యాలు తెలియునట్లు ఆకాశతత్వంతో అచ్చు పోశారు
నా కర్మ భావాలను గ్రహించన వారికి కర్మలు తొలుగునని రహస్య మేఘమర్మము
No comments:
Post a Comment