Sunday, May 30, 2010

మన మేధస్సులో ఒక భాష

మన మేధస్సులో ఒక భాష విజ్ఞానం ప్రజ్ఞానంగా ఉంటే దేనినైనా తెలుపవచ్చు
ఎంతటి భావాలనైనా గ్రహించవచ్చు ఏ రహస్యాలనైనా వివరంగా విశదీకరించవచ్చు
ఎవరికి తెలియని విశ్వ విజ్ఞానాన్ని కూడా అర్థమయ్యేలా ఒక భాషలో తెలుపవచ్చు
ఇంతవరకు కనివిని ఎరుగని నూతన వేద విజ్ఞానాన్ని కూడా ఎందరికో భోదించవచ్చు
వాక్య విధాన శైలిలోనే మర్మ రహస్యాలను నిఘూడముగా భావ తత్వాలతో లిఖించవచ్చు
నేడు మనకు తెలిపే కొత్త పాత విషయాలు సమాచార వార్తా కేంద్రాలలో ఓ భాష ప్రజ్ఞానమే
తెలిసిందే గొప్పగా తెలియనిదే మహా విషయంగా నూతనమే రహస్యంగా ఎవరూ గ్రహించనిదే మర్మముగా
ఇంత కాలం మనం గ్రహించినదంతా భాష విజ్ఞానమేనని స్పష్టంగా తెలుస్తుంది
ఒక భాష కన్నా ఎక్కువ భాషలు నేర్చిన వారికి ఎక్కువ విషయాలు గ్రహించే స్తోమత ఉంటుంది
ఒక ప్రాంతపు విజ్ఞానమే కాక వివిధ ప్రాంతాల ప్రపంచ విజ్ఞానాన్ని తెలుసుకోవుటలో మరో భాషయే

No comments:

Post a Comment