మరణించే సమయాన ఓ భావం తెలుపుతున్నది నన్ను వదలొద్దని
నీ శ్వాసనై నీతో జీవిస్తున్న నన్ను ఎప్పటికీ మరో ధ్యాసలోనైనా వదలొద్దని
నాకు యుగాలుగా జీవించాలనే తపన ఇంకా ఉందనే నే తెలుపుతున్నాను
నన్ను వదులుకుంటే మళ్ళీ నాలాంటి భావాలు ఏ శ్వాస నీకు కలిగించదు
విశ్వ విజ్ఞాన భావాలన్నీ నీ మేధస్సులో చేరేవరకు నే నీకు తోడుగా ఉంటా
విశ్వంలో ఎక్కడ ఎంత కాలం ప్రయాణించాలన్నా నేనే నీకు సరైనవాన్ని
నీవు ధ్యానించుటలో నా పై ఉన్న నీ ధ్యాస నేను ఎప్పటికీ మరవలేను
నీ ధ్యాసే నన్ను నీవు వదలలేక పోతున్నావని నేనే నీకు తెలుపుతున్నా
నాపై ధ్యాస ఉన్నంతవరకు నేను నిన్ను వదలనేనని మరల తెలుసుకో
మరో ధ్యాసలో మనస్సు వెళ్ళినా నా పై ఎప్పటికీ ఓ ధ్యాస ఉంచాలనే
ధ్యాస లేనప్పుడే నీవు మరణిస్తావని నీ జీవితాన్ని సాగించుటకు నేనేనని
నన్ను వదులుకోకూడదనే నా శ్వాసలోని ఓ భావన నీకు నిత్యం ధ్యాసగా
No comments:
Post a Comment