Monday, May 24, 2010

కాలము ఏదో ఒక మార్గాన్ని

కాలము ఏదో ఒక మార్గాన్ని చూపునని మనకు తెలియును
మనకు కావలసిన మార్గం మనకై రావడమే నేడు చాలా కష్టం
ఎన్నో రకాలుగా విజ్ఞానంగా ప్రయత్నించినా రాకుండా పోగలదు
కొందరికైతే అనుకున్నవి లభిస్తాయి అనుకోకున్నా వరిస్తాయి
కొందరు ఎన్ని విధాల కష్టపడినా సమయానికి అందకుండానే
విజ్ఞానంలోనే ఎక్కువ తక్కువలు విభిన్న తేడాలు విశేషంగా
విజ్ఞానం ఉన్నా లేకున్నా మనిషి కష్టపడుతూనే జీవించాలి
కష్టపడుటకైతే కాలం ఏదో ఒక మార్గాన్ని చూపునని తెలియును
అదృష్టం వరిస్తుంది దురదృష్టం తప్పిస్తుంది కర్మ వెంటాడుతుంది

No comments:

Post a Comment